Assembly Incident
ఆకేరు న్యూస్,హైదరాబాద్ : అసెంబ్లీ గేట్ వద్ద జరిగిన (Assembly Incident) ఘటనపై సైఫాబాద్ పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేష్‌ను పోలీసులు అసెంబ్లీ పరిసరాలకు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అంశంపై పోలీసులు, మహేందర్‌రెడ్డి, మహేష్ తరఫు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌కు ముందు తమకు నోటీసులు ఇవ్వాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారని మహేందర్‌రెడ్డి, మహేష్ తరఫు న్యాయవాదులు ఆరోపించారు.
దీంతో పోలీసులు, న్యాయవాదుల మధ్య కొంతసేపు వాదనలు జరిగాయి. అసెంబ్లీ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
