* సీఎం చంద్రబాబుతో భేటీ తర్వాత ప్రకటన
* తీగల వెంట బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి(Tegala Krishnareddy) తెలిపారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మనవరాలు శ్రేయారెడ్డి పెళ్లికి రావాలని మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి చంద్రబాబును ఆహ్వానించారు. బాబుతో కాసేపు ముచ్చటించారు. అనంతరం బయటకు వచ్చిన తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ(Tdp)కి పూర్వ వైభవం తెస్తామన్నారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రదాత, చంద్రబాబు హయాంలోనే సైబరాబాద్(Cybrabad) ఏర్పాటైందని తెలిపారు. ఎన్టీఆర్(Ntr) తోనే మా రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు. త్వరలో చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు తెలిపారు. మళ్లీ మాట్లాడతానని చంద్రబాబు చెప్పారని అన్నారు. తీగల ఆ ప్రకటన చేసిన సమయంలో వెంట బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు(Madavaram Krishnarao) కూడా ఉన్నారు. ఈక్రమంలో వారు కూడా టీడీపీలో చేరతారా అనే చర్చ మొదలైంది. ఏం జరగనుందో మున్ముందు చూడాలి.
………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
