Published:
Updated: 08 Oct 2024 • 04:11 AM
* టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణిలను క్షేమంగా సొంతూళ్లకు చేర్చేందుకు సహకరించాలని పోలీసు, రవాణా శాఖ అధికారులను సజ్జనార్ కోరారు. మహాలక్ష్మీ పథకం అమలు కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సారి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 9 నుంచి 12 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
…………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
