Published:
Updated: 08 Oct 2024 • 11:40 AM
ఆకేరు న్యూస్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మనీల్యాండరింగ్ కేసులో ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఐదు రోజుల క్రితం భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, అజారుద్దీన్ నిధులను దుర్వినియోగం చేశారని, సంస్థలో ఆర్థిక అవకతవకలపై గణనీయమైన ఆందోళనలు లేవనెత్తారనేది ఈడీ ఆరోపణలు. ప్రస్తుతం అజారుద్దీన్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. హాజరయ్యే ముందు మీడియా ఓ ప్రశ్నలకు అవినీతి ఆరోపణలన్నీ ఫాల్స్ అని వ్యాఖ్యానించారు.
…………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
