Published:
Updated: 08 Oct 2024 • 11:38 AM
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విభిన్న ఆలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. మండపాల్లో పూజలు అందుకుంటున్నారు. ఆరవ రోజైన మంగళవారం శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా, అమలాపురంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని రూ. 3. 33 కోట్ల కరెన్సీ నోట్లతో అలంకరించారు. దీంతో అమ్మ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అలాగే, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ఆలయంలో దుర్గమ్మను 2.20 కోట్లతో అలంకరించారు.
………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
