* కీలక అంశాలపై చర్చ
ఆకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ని కలిసి చంద్రబాబు రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులపై చర్చించారు. ప్రధానంగా అమరావతి(Amaravati), పోలవరం ప్రాజెక్టుకు నిధులతో పాటు వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు అంశాలపై చర్చించారు. సెయిల్‌లో విశాఖ స్టీల్ విలీనం, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్ శంకుస్థాపన తదితర అంశాలు కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఈరోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nithin Gadkary)తో భేటీ అయ్యారు. ఏపీ రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రోడ్డు కనెక్టివిటీపై చర్చించారు. అలాగే, అమరావతి- హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి, అమరావతి-రాయలసీమ జిల్లా కనెక్టివిటీ ఇతర రహదారుల అంశాలపై గడ్కరీతో చంద్రబాబు చర్చించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కూడా ఉన్నారు.
…………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
