* హర్యానాలో హ్యాట్రిక్ విజయం దిశగా బిజెపి
* జులానా నుంచి వినేశ్ ఫోగట్ విజయం
* కాశ్మీర్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా
* ఒమర్ అబ్దుల్లానే తదుపరి సీఎం అన్న ఫరూక్
* 370ని ప్రజలు తిరస్కరించారని ఫరూక్ వ్యాఖ్య
ఆకేరు న్యూస్, ఢిల్లీ: హరియాణా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగుతున్న హరియాణా పోరులో భాజపా హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తోంది. తొలుత కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. అనూహ్యంగా కమలం పుంజుకుని ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా వెళ్తోంది. అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ` కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చినట్లే కన్పిస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే మాత్రం హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించి నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్క్ సాధించక పోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. హర్యానా ఎన్నికల్లో అందరినీ దృష్టిని ఆకర్షించిన రెజ్లర్ వినేశ్ ఫోగట్ కాంగ్రెస్ అభ్యర్థిగా జులానా నుంచి పోటీచేసి గెలుపొందారు. హరియాణాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం. ప్రస్తుతం ఇక్కడ భాజపా ఆధిక్యం, గెలుపు కలిపి 47 స్థానాల్లో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ 37 స్థానాలకు పరిమితమైంది. ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఇక్కడ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి అత్యధిక స్థానాల్లో ముందంజలో ఉంది.హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ కమలం పార్టీ 51 స్థానాల్లో లీడిరగ్లో ఉంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు షురూ చేశారు. పార్టీ అత్యధిక స్థానాల్లో లీడిరగ్లో ఉండటంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు మొదలు పెట్టారు. అంబాలో పార్టీ జెండాలను చేతపట్టుకుని డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. మిఠాయిలు తినిపించుకున్నారు. కొన్ని చోట్ల బీజేపీ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు టీ 20 మ్యాచ్‌ను తలపించాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో దూసుకెళ్లిన కాంగ్రెస్ ఒక్కసారిగా పడిపోయింది. ఈవీఎంలు లెక్కింపు తర్వాత వైకుంఠపాళీ ఆటలో మాదిరిగా కాంగ్రెస్ ఒక్కో సీటు తగ్గుతూ వచ్చింది.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట్లో కాంగ్రెస్ దూసుకెళ్లింది. దాదాపు అరవైకిపైగా స్థానాల్లో ఆధిక్యం చూపించింది. ఈ దెబ్బకు బీజేపీకి 20 స్థాలైనా వస్తాయా అన్న అనుమానం కలిగింది. కానీ 10 గంటల తర్వాత ఫలితాలు తారుమారు అవుతూ వచ్చాయి. అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్తున్న కాంగ్రెస్ ఒక్కసారిగా పడిపోయింది. బీజేపీ సునావిూ మొదలైంది. ఒకానొక దశలో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదేమో అన్నట్టు ఫలితాలు వచ్చాయి. అయినా చివరకు బీజేపీ పై చేయి సాధించింది. యాభైకు పైగా స్థానాల్లో ఆధిక్యం చూపించి హర్యానాలో ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. హర్యానాలో మొదటి ట్రెండ్స్ చూసిన కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఏఐసీసీ కార్యాలయం వద్ద స్వీట్స్ పంచుకున్నాయి. బాణసంచా పేల్చాయి. వాళ్ల సంతోషం ఎంతసేపు నిలవలేదు. అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఫలితాలు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆధిక్యం, గెలుపు కలిపి 43 స్థానాల్లో దూసుకెళ్తోంది. ఇక, భాజపా 28, పీడీపీ 2, కాంగ్రెస్ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ, భాజపా, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి. ఎన్నికల ముందే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ.. తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు ఒమర్ అబ్దుల్లానే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతారని తెలిపారు. పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు. ఆగస్టు 5 నాటి ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టంగా చెప్పారు. ఒమర్ అబ్దుల్లానే తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేం దుకు మా కూటమి నిరంతరం పోరాడుతుందని ఫరూక్ అబ్దుల్లా వెల్లడిరచారు.ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు అవసరం.
…………………………………