* ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు
ఆకేరు న్యూస్, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pavan Kalyan) కాసేపటి క్రితం దర్శించుకున్నారు. కుమార్తె ఆద్యతో కలిసి విజయవాడ(Vijayawada) వచ్చిన పవన్.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రంలో అమ్మవారిని దర్శించుకుంటే అంతా శుభం జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖులతో పాటు, సామాన్య భక్తులు ఆలయానికి పోటెత్తారు. సీఎం చంద్రబాబునాయుడు(Cm Chandrababu) కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఈమేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సరస్వతీదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
