* కారును ఢీకొన్న టూరిస్టు వ్యాన్
* ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి
ఆకేరు న్యూస్ డెస్క్ : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులందరూ కారులో బయలుదేరారు. అక్కడ సంతోషంగా గడిపారు. తిరుగు ప్రయాణంలో తిరుపూర్ జిల్లా పరిధి మతుకళం సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారును టూరిస్టు వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ఎగిరిపడగా, అందులోని ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యానులోని 20 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. పోలీసులు వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
………………………………..