Published:
Updated: 11 Oct 2024 • 12:03 PM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక సూచన చేశారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలో ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో ఈ దసరా పండుగ నాడు అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామంటూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, అది ప్రమాదానికి హెచ్చరికగా గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు.
………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
