* వాతావరణ శాఖ అలర్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాగల మూడు రోజులూ తెలంగాణ(Telangana)లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్(Hyderabad)లో సాయంత్రం వాన కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వరంగల్(Warangal), హనుమకొండ, మహబూబ్నగర్, వనపర్తి, నారాయణపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి తదితర ప్రాంతాల్లోనూ సాయంత్రం వర్షం కురిసే ఉంది. శుక్రవారం ఆదిలాబాద్(Adilabad), ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో వానలుపడే అవకాశాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్(Yello Allert)ను జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, నల్గొండ(Nalgonda), వికారాబాద్, వనపర్తి తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి.
……………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
