* గూడ్స్ రైలును ఢీకొన్న మైసూర్ దర్భంగా ఎక్స్‌ప్రెస్
* విమాన ఎమర్జెన్సీ ల్యాండిరగ్ ఘటన జరిగిన తమిళనాడులోనే రైలు ప్రమాదం కూడా..
ఆకేరు న్యూస్, డెస్క్: చెన్నై శివారులో, తిరువళ్లూరులో రైలు ప్రమాదం జరిగింది. కవరాయ్ పెట్టాయ్ రైల్వే స్టేషన్లో ఆగివున్న గూడ్స్ రైలును మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో.. 6 బోగీలు పట్టాలు తప్పగా. వాటిలో రెండు బోగీలకు మంటలు అంటుకున్నాయి. బోగీల మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణికులు గాయపడగా.. కొంతమంది బోగీల్లో ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించారు. రైలు ఢీకొట్టినప్పుడు దాని వేగం గంటకు 109 కిలోమీటర్లుగా చెబుతున్నారు. లూప్‌లైన్ లోకి వెళ్లిన ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలును ఢీకొంది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం వల్ల చెన్నై, నెల్లూరు మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రైలు ప్రమాద వివరాలు తెలుసుకునేందుకు చెన్నైలో హెల్ప్ లైన్ నంబర్లు 044 25354151, 044 24354995 ఏర్పాటు చేశారు.
………………………………..