ఆకేరున్యూస్, హన్మకొండ: తెలంగాణ ప్రైవేట్ డీగ్రీ, పీజీ కాలేజీల మెనేజ్మెంట్ పిలుపుమేరకు కళాశాలలకు రావలసిన ఫీజు రీయింబర్సుమెంట్ విడుదల కోసం చేపట్టిన రెండోరోజు కాలేజీలను సంపూర్ణంగా బంద్ చేశామని కీకతీయ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని.. దీనికి నిరసనగా రేపు పెద్ద ఎత్తున ఉదయం 10గంటలకు ఏకశీల పార్కు వద్ద యాజమాన్యాలు, అధ్యాపకులతో నిరసన దీక్ష చూపడతామని తెలియజేశారు. దీక్ష అనంతరం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ వరకు శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, పీజీ యాజమాన్యాలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
