* పవన్, లోకేశ్‌కు నోచాన్స్
* 26 జిల్లాలకు 25 మందితో జాబితా
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలకూ ఇన్చార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 జిల్లాలకు 25 మందిని నియమిస్తూ జాబితా విడుదల చేసింది. అయితే, కీలక మంత్రులుగా ఉన్న పవన్ కల్యాణ్, లోకేశ్‌లకు ఏ జిల్లా బాధ్యతలూ అప్పగించలేదు. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే కీలక బాధ్యతలు వారు నిర్వహిస్తుండడంతో ఇన్చార్జి బాధ్యతల నుంచి విముక్తి కల్పించినట్లు తెలుస్తోంది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు బాధ్యతలను యువ మంత్రికి అప్పగించారు.
ఎవరు ఏ జిల్లాకు ఇన్చార్జి మంత్రి అంటే..
* కాకినాడ జిల్లా – పొంగూరు నారాయణ
* తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాలు – నిమ్మల రామానాయుడు
* పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాలు – గొట్టిపాటి రవికుమార్
* ఏలూరు జిల్లా – నాదెండ్ల మనోహర్
* కృష్ణా జిల్లా – వాసంశెట్టి సుభాష్
* ఎన్టీఆర్ జిల్లా – సత్యకుమార్ యాదవ్
* ప్రకాశం జిల్లా – ఆనం రామనారాయణరెడ్డి
* తిరుపతి, శ్రీసత్యసాయి జిల్లాలు – అనగాని సత్యప్రసాద్
* చిత్తూరు జిల్లా – మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
* గుంటూరు జిల్లా – కందుల దుర్గేష
* బాపట్ల జిల్లా – కొలుసు పార్థసారథి
* నెల్లూరు జిల్లా – ఎన్ఎండీ ఫరూఖ్
* కడప జిల్లా – సవిత
* అనంతపురం జిల్లా – టీజీ భరత్
* అన్నమయ్య జిల్లా – బీసీ జనార్థర్ రెడ్డి
* నంద్యాల జిల్లా – పయ్యావుల కేశవ్
* శ్రీకాకుళం జిల్లా – కొండపల్లి శ్రీనివాస్
* అల్లూరి సీతారామరాజు జిల్లా – గుమ్మడి సంధ్యారాణి
* పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు – అచ్చెన్నాయుడు
* విజయనగరం జిల్లా – వంగలపూడి అనిత
* విశాఖపట్నం జిల్లా – డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
* అనకాపల్లి జిల్లా- కొల్లు రవీంద్ర
………………………….