* చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు తప్పిన పెను ప్రమాదం
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకుంది. సీఈసీ రాజీవ్ కుమార్, ఉత్తరాఖండ్ అదనపు సీఈవో విజయ్ కుమార్‌తో కలిసి మున్సియారీకి హెలికాప్టర్లో బయల్దేరింది. హెలికాప్టర్ పర్వత ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుండగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్ హెలికాప్టర్‌ను పిథోరాగఢ్ జిల్లాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రస్తుతం హెలికాప్టర్లో ఉన్నవారంతా సురక్షితంగా ఉన్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడిరచింది. వాతావరణం అనుకూలించిన తర్వాత వీరు తమ పర్యటనను కొనసాగిస్తారని పేర్కొంది.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
