* మార్పులు పేరిట స్కాంలు చేస్తున్నారు
* రూ. 10 వేల జీతం అంటూ వాలంటీర్లను మోసం చేశారు..
* ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ ప్రవేశ పెట్టడం లేదు.
* ఇసుక, మద్యం పాలసీలోనూ అక్రమాలు
* రాష్ట్రంలో పేకాట క్లబ్బులు పెరిగాయి..
* ఏపీలో మాఫియా రాజ్యం
* టీడీపీ పాలనపై మాజీ సీఎం జగన్ ధ్వజం
ఆకేరు న్యూస్, అమరావతి : ఏపీలో దోచుకో.. పంచుకో, తినుకో..(డీపీటీ) పాలన సాగుతోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మార్పులు పేరిట స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం 5 నెలల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 10 వేల జీతం అంటూ వాలంటీర్లను మోసం చేశారని, 5 నెలల కాలంలో సూపర్ సిక్స్ లు లేవని అన్నారు. ప్రజలు నిలదీస్తారనే బడ్జెట్ ప్రవేశ పెట్టడం లేదని తెలిపారు. ఇసుక, మద్యం పాలసీలోనూ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు పెరిగాయని విమర్శించారు. ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చారని, ఇప్పుడు ఇసుక, మద్యం అన్నింట్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు హయాంలోనే కొత్త కొత్త బ్రాండ్లను తెచ్చారని, ఇప్పుడు నాణ్యమైన లిక్కర్ అని ప్రచారం చేస్తున్నాడన్నారు. అప్పుడు, ఇప్పుడు అవే డిస్టిలర్ నుంచి మద్యం సరఫరా అవుతుందని వివరించారు.
రాష్ట్రంలో 20 డిస్టిల్లరీస్ ఉంటే.. వాటిలో 14 చంద్రబాబు హయాంలోనే వచ్చాయి.. మిగతా ఆరు అంతకు ముందు వచ్చాయి.. వైసీపీ హయాంలో ఒక్క డిస్టిల్లరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదని, ప్రజల ఆరోగ్యం కోసం మద్యం తగ్గించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. చంద్రబాబు హయాంలో కూడా ఉన్నది అదే లిక్కర్, వైసీపీ హయాంలో కూడా అదే లిక్కర్ ఉందన్నారు. ఏపీలో మాఫియా రాజ్యం, అవినీతి పాలన నడుస్తోందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పాలనలో డైరెక్టు టు బెనెఫిట్ లేదన్న జగన్.. దోచుకో, తినుకో, పంచుకో అనేది చంద్రబాబు పాలనలో ఉంది అన్నారు. కొన్ని ప్రాంతాల్లో లారీ ఇసుక రేటు 20 వేల నుంచి 60వేల దాకా ఉందని, అప్పట్లో మేము అమ్మిన దాని కంటే రెండింతలు ఎక్కువ ధర ఇప్పుడు ఉందని తెలిపారు. ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి, ఛార్జీలు పెంచుతున్నారు. ఉచిత ఇసుక ఎవరికి ఇస్తున్నారో చెప్పాలన్నారు.
……………………………………..