* కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూసీ సుందరీకరణ, పునరుజ్జీవనానికి తాము వ్యతిరేకం కాదని ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చితే ఊరుకునేది లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Central Minister Kishanreddy) చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) మూసీ సుందరీకణ, పునరుజ్జీవం కోసం కీలక చర్యలు తీసుకుంటున్నదని అందుకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మూసీ(Musi) పునరుజ్జీవం పేరుతో డ్రైనేజీ నీటిని మూసీ నదిలో కలవకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. మూసీ నది రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ నది సుందరీకరణను వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. తాము పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదని, అలాగే పేదల ఇళ్లను అకారణంగా కూల్చివేస్తే ఊరుకోబోమని కిషన్ రెడ్డి(Kishanreddy) తెలిపారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
