* ఎస్సీ ఎస్టీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ బక్కి వెంకటయ్య
ఆకేరున్యూస్, వరంగల్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేయాలని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన కమిషన్ సభ్యులు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, లీలాదేవి, రాంబాబు నాయక్ , డిసిపి రవీందర్ లతో కలిసి ల్యాండ్, సర్వీస్ అట్రాసిటీ, కేసులు వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లాలో వివిధ శాఖల ద్వారా ఎస్సీ ఎస్టీలకు అందుతున్న అభివృద్ధి ఫలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి మంజూరైన నిధులు, వినియోగించి నిధులకు సంబంధించిన వివరాలను శాఖల వారీగా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి బాధ్యులకు న్యాయం చేయాలని సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. నమోదైన కేసుల విషయంలో త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ప్రభుత్వ నియామకాలలో రోల్ ఆఫ్ రిజర్వేషన్ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులకు ఆదేశించారు. విదేశీ విద్యా పథకం గురుకుల పాఠశాలలో ఎస్సీ విద్యార్థులకు అందుతున్న భోజనం వసతి సౌకర్యాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పై. ఆయన సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వివిధ శాఖల ద్వారా సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకుగాను సివిల్ రైట్స్ డే నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డిఓ కృష్ణవేణి, జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, డి ఆర్ డి ఓ కౌసల్యాదేవి, జిల్లా ఎస్సీ , బిసి సంక్షేమ అధికారులు భాగ్యలక్ష్మి పుష్పలత సంబంధిత శాఖల అధికారులు, రెవిన్యూ అధికారులు తాసిల్దార్లు మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..