* గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా నిరసన
* జీవో 29 రద్దు చేయాలని డిమాండ్
* ఉద్రిక్తంగా అశోక్‌నగర్ పరిసరాలు
* బండికి సీఎం ఫోన్.. జీఓ 29పై చర్చకు రావాలని ఆహ్వానం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్ – 1 (Group – 1)అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bjp Mp Bandi Sanjay) అశోక్‌నగర్ కు వెళ్లారు. జీవో 29 రద్దు చేయాలని ఆందోళన చేపట్టారు. చలో సెక్రటేరియట్(Chalo Secretariat)కు పిలుపు ఇవ్వడంతో అశోక్‌నగర్ కు భారీగా గ్రూపు 1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గ్రూపు – 1 అభ్యర్థులతో కలిసి సెక్రటేరియట్‌కు వెళ్తుండగా, ఇందిరాపార్కు సిగ్నల్ దాటిన తర్వాత బండి కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సంజయ్ బయటకు వచ్చి కారుపైకి ఎక్కి నిరసన తెలిపారు. జీఓ 29 రద్దు చేయాలని ప్లకార్డు పట్టుకుని అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. పోలీసులు గో బ్యాక్ అంటూ అభ్యర్థులు నినాదాలు చేశారు. బండి మాట్లాడుతూ.. సీఎం సమయం ఇస్తే కలిసి సమస్య వివరిస్తామని వెల్లడించారు. విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి..(Cm Revanthreddy) బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. జీవో 29పై చర్చకు రావాలని ఆహ్వానించడం ఆసక్తిగా మారింది.
……………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
