* హిందూ సంఘాల ఆందోళన
* ముత్యాలమ్మ దేవాలయంపై దాడి ఘటనపై నిరసనలు
* బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్
ఆకేరు న్యూస్, సికింద్రాబాద్ : ముత్యాలమ్మ ఆలయం(Mutyalamma Temple)పై దాడిని నిరసిస్తూ హిందూ సంఘాలు సికింద్రాబాద్(Secunderabad)లో నిర్వహిస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో ఆందోళనకారులు.. పోలీసులపై చెప్పులు, కుర్చీలు విసిరారు. దీంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. మరోవైపు నిందితులను కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారులు దుకాణాలు మూసివేసి స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు ముత్యాలమ్మ దేవాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Mp Etalarajender) ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
