
* రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ప్రముఖులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం కాసేపటి క్రితం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanthreddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Deputy Cm Batti Vikramarka), ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్ బాబు, డి.సీతక్క తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్(Niranjan) ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి(Ex minister Geethareddy)కి సద్భావన అవార్డును అందజేశారు. చార్మినార్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
………………………………………