* హైకోర్టు ఆదేశాలతోనే పరీక్షలు
* సుప్రీంకోర్టుకెళ్లాలి.. ఆందోళనలు చేస్తే సహించబోం : డీజీపీ జితేందర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్, అభ్యర్థులు ఆందోళనలు చేస్తుండగానే తెలంగాణ డీజీపీ జితేందర్(Dgp Jitender) కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రకటించారు. హైకోర్టు(High Court) ఆదేశాలతోనే పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీలైతే సుప్రీంకోర్టు(Suprm Court)కెళ్లాలి కానీ, ఆందోళనలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. పరీక్షలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. రోడ్డుపైకి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దని హెచ్చరించారు. నిన్న అభ్యర్థులను అడ్డుకున్నామని, ఈరోజు మళ్లీ రోడ్డుపైకి వచ్చారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ తమ బాధ్యత అని, ఈక్రమంలోనే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
