* పాఠశాలలకు సెలవు
ఆకేరున్యూస్, డెస్క్: కర్ణాటక రాజధాని బెంగళూరును గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కూడా నగరంలో కుండపోత వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ఇదే రీతిలో కొనసాగితే లోతట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈలాగే నేడు బెంగళూరులో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఐఎండీ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లాలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించింది.
………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
