* నంధ్యాలలో నమోదైన కేసు స్క్వాష్ చేయాలని పిటిషన్
ఆకేరు న్యూస్, అమరావతి : ప్రముఖ హీరో అల్లు అర్జున్(ALLU ARJUN) ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంధ్యాలలో తనపై నమోదైన కేసును స్క్వాష్ చేయాలని అభ్యర్థించారు. సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండగా అనుమతి లేకుండా జనసమీకరణ చేపట్టారంటూ అల్లు అర్జున్‌పై నాడు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా ఆయన హైకోర్టు(HIGH COURT)ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ నంద్యాల శాసనసభ వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఇంటికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయితే ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నంద్యాలలో అల్లు అర్జున్, శిల్పా రవి(SILPA RAVI) ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులకు రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆర్వో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అల్లు అర్జున్, శిల్పా రవిలపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేశారు. క్రైమ్ నంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
