* ముత్యాలమ్మ గుడి సంఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది
* ప్రజలు సహగమనం గా ఉండాలి
* అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి శ్రీమతి కొండా సురేఖ ( KONDA SUREKHA) అన్నారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరూ దేవాలయాలపై రాజకీయాలు చేయవద్దని మంత్రి సురేఖ ( KONDA SUREKHA) విజ్ఞప్తి చేశారు. దైవాన్ని మతాల ప్రాతిపదన విభజించవద్దని హితవు పలికారు. చారిత్రాత్మకమైన ఈ హైదరాబాద్ నగరం మత సామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉండి, గంగా జమునా తెహజీబ్‌ను కాపాడుకుంటూ వస్తుందని మంత్రి సురేఖ ( KONDA SUREKHA) అన్నారు.
సికింద్రాబాద్‌లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే నిందితున్ని అరెస్టు చేశామని గుర్తు చేశారు. నిందితునికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు చేతల ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనలో కొంతమంది అల్లరి మూకలు చేరి, మతసామరస్యతకు భంగం కలిగేలా చేస్తున్నారన్నారు.
ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదు
ప్రతిపక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం ఎక్కడా నిర్లక్ష్యం వహించకుండా చర్యలు చేపట్టిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే అక్కడికి దేవాదాయ శాఖ అధికారులను పంపించి సమగ్ర వివరాలు సేకరించినట్టు మంత్రి తెలిపారు. ఈ రోజు నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయని.. మిగతా పార్టీల మాదిరి తాము గుడులపై, ప్రజల నమ్మకాలపై రాజకీయాలు చేయదలుచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు.
రేపు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సికంద్రాబాద్‌లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని సందర్శించాలని ఆదేశించినట్టు మంత్రి సురేఖ వెల్లడిరచారు. ఇటువంటి ఘటనల పట్ల దేవాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంయమనం పాటించాలనీ, హైదరాబాద్ నగర మత సామరస్యాన్ని కాపాడాలనీ మంత్రి సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
