ఆకేరు న్యూస్, భద్రాచలం : భద్రాచలం(BADRACHALAM) శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (TELANGANA GOVERNOR GISHNUDEV VARMA)ఈరోజు ఉదయం సందర్శించారు. ఆయనకు పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసేపట్లో భద్రాచలం నుంచి రోడ్డుమార్గంలో కొత్తగూడెంకు బయల్దేరి వెళ్లనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అనంతరం కలెక్టర్ ఆఫీస్‌లో అధికారులతో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత కళకారులు, రచయితలతో సమావేశమయి చర్చించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలోని ఎన్ ఎస్పి (NSP) గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఖమ్మం(KHAMAM) కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్(HYDERABAD)కు తిరుగు పయనం కానున్నారు?
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
