* అవగాహన లేకే అనర్థాలు
* రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ రీజినల్ సెంటర్లు : మంత్రి దామోదర రాజనర్సింహ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహిళలు అందరికీ ప్రభుత్వం ఉచితంగా కేన్సర్ స్క్రీనింగ్, చికిత్స అందిస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha)తెలిపారు. ప్రతి గ్రామంలో మొబైల్ ల్యాబ్స్ ద్వారా ఉచితంగా స్క్రీనింగ్ చేయిస్తామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు క్యాన్సర్ రీజినల్ సెంటర్ల(Cancer Reginal Centers)ను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. ఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad)లోని లుంబిని పార్క్ నుంచి ఎంఎన్ జే క్యాన్సర్ దవాఖాన వరకు నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండ్ వాక్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయన్నారు. దేశంలో ఏటా 14 నుంచి 15 లక్షల క్యాన్సర్ కేసులు నమోదవుతుంటే.. తెలంగాణలో 50 నుంచి 60 వేల కేసులు ఉంటున్నాయని చెప్పారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ కేన్సర్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. దీనిపై అవగాహన కల్పించి, స్క్రీనింగ్(Screening) చేస్తే ప్రాథమిక దశలోనే రోగ నిర్ధారణ చేయొచ్చని వెల్లడించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
