* విచారణకు రావాలని ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫాంహౌస్లో పార్టీ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బీఎన్ఎస్ఎస్ 35(3) సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసినట్లు మోకిల పోలీసులు తెలిపారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని.. నేడు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అడ్రస్ ఫ్రూఫ్, కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని సూచించారు. విచారణకు రాకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పోలీసులకు అందుబాటులోకి రాకపోవడంతో మోకిల ఇన్స్పెక్టర్ పేరుతో ఉన్న నోటీసులను రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్లో రాజ్ పాకాల నివాసానికి అతికించారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో హైకోర్టును రాజ్ పాకాల ఆశ్రయించారు. అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అక్రమంగా ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో ఆయన కోరారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
