* లొసుగులు లేని నివేదికే మా లక్ష్యం
* బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కీలక వ్యాఖ్యలు
* నిజామాబాద్ జిల్లాలో పర్యటన.. సాయంత్రం వరకు బహిరంగ విచారణ
ఆకేరు న్యూస్, నిజామాబాద్ :స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై బీసీ కమిషన్ నిజామాబాద్(NIjamabad) జిల్లాలో పర్యటిస్తోంది. రిజర్వేషన్లపై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తోంది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ నిరంజన్ (Commision chairmen Niranjan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరు కోర్టుకెళ్లినా చెల్లుబాటు అయ్యేలా బీసీ రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలనేది తమ లక్ష్యం అని ప్రకటించారు. గతంలో కర్ణాటక, బిహార్లో రిజర్వేషన్లు ఖరారు చేసినా కోర్టులో చెల్లుబాటు కాలేదని గుర్తు చేశారు. ఎలాంటి లోసుగులూ లేకుండా చూస్తున్నామని, ఇందుకు ప్రజల అందరి సహకారం అవసరమని వెల్లడించారు. బీసీ కమిషన్(BC Commission) పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి నిజామాద్ జిల్లాలోని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాల ప్రతినిధులు ప్రజలు అభిప్రాయాలు చెప్పేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ కొనసాగనున్నది. కాగా, వచ్చే నెల 13 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనున్నది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా శాస్త్రీయపద్ధతిలో కులగణన నిర్వహించాలని, రిజర్వేషన్ల శాతాన్ని పెంచడంతోపాటు కులవృత్తుల ఆధునీకరణకు సైతం ఊతమివ్వాలని బీసీ కులసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
…………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
