* కండీషన్స్ అప్లయ్
ఆకేరు న్యూస్ డెస్క్ : దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారుల కోసం సంస్థ అధినేత అంబానీ ప్రత్యేక ప్రకటన చేశారు. అన్లిమిటెడ్ 5G డేటాతో పాటు వినియోగదారులు హై-స్పీడ్ ఇంటర్నెట్ను అందించనున్నట్లు తెలిపారు. అంతేకాదు.. జియో దీపావళి ఆఫర్ కింద వినియోగదారులు ఒక సంవత్సరం పాటు ఫ్రీ ఇంటర్నెట్ని పొందుతారు. అయితే ఈ ఆఫర్ కోసం వినియోగదారులు రూ.20 వేల వరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. జియో దీపావళి ఆఫర్లో కస్టమర్లు మై స్టోర్ నుంచి 20,000 షాపింగ్ చేస్తే వారికి 1 సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ అందుబాటులోకి వస్తుంది. జియో ప్రకారం కస్టమర్లు 1 సంవత్సరం పాటు ఉచిత ఇంటర్నెట్ సర్వీస్ పొందేందుకు నవంబర్ 3లోపు మై స్టోర్ (My Store) నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుండి షాపింగ్ చేయడం ద్వారా మీరు జియో ఇంటర్నెట్ను ఒక సంవత్సరం పాటు ఉచితంగా వినియోగించవచ్చు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
