ఆకేరు న్యూస్ డెస్క్ : మలుపు వద్ద కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 8 మంది దుర్మరణం చెందారు. ఛత్తీస్ గఢ్ లోని బల్ రామ్‌పూర్(Rampur)లో ఈ విషాదం చోటుచేసుకుంది. బల్రాంపూర్ జిల్లాలోని లారిమా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎస్ యూవీ కారు(Uv Car)లో పొరుగున ఉన్న సూరజ్‌పూర్ జిల్లాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బుధబాగిచా ప్రాంతం నుంచి సూరజ్ పురకు వెళ్తుండగా లాదువా మలుపు వద్దకు రాగానే కారు అదుపు తప్పి చెరువులో పడిపోయిందని పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం(Police Team) సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వాహనం డ్రైవర్‌ను పోలీసులు రక్షించారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక బాలిక ఉన్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వాహన డ్రైవర్‌ను ఆసుపత్రిలో చేర్చారు. జేసీబీ యంత్రం సాయంతో చెరువులో నుంచి వాహనాన్ని బయటకు తీశారు. స్థానికులు, పోలీసు సిబ్బంది సహాయంతో చెరువులో ఉన్న కారును బయటకు తీశారు. వాహనంలోనే ఆరుగురు మరణించగా..తీవ్రంగా గాయపడ్డవారికి ఆసుపత్రికి తరలిస్తుండగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. మరణించినవారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
