
* యూపీ సీఎంకు బెదిరింపు
ఆకేరున్యూస్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ను రాజీనామా చేయాలని.. లేదంటే చంపేస్తామని ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. పది రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదంటే బాబా సిద్ధిఖీలాగా చంపుతామని దుండగులు అందులో పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ సెల్‌కు ఒక నంబర్ నుంచి మెసేజ్ రావడంతో ఈ సమాచారాన్ని యూపీ పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
……………………………….