* ధాన్యం కొనుగోలు చేయాలని సిరిసిల్లా జిల్లాలో నిరసన
ఆకేరు న్యూస్, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లా జిల్లా (Siricilla district) ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులు ఆందోళనలకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కారు. ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేశారు. తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రైతులు హెచ్చరించారు. కాగా, రైతుల ఆందోళనతో సిరిసిల్ల- కామారెడ్డి(Siricilla-Kamareddy) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
