* వరల్డ్ ట్రావెల్ మార్కెట్లో పాల్గొననున్న మంత్రి జూపల్లి
* లండన్ వేదికగా నవంబర్ 5 నుంచి7 వరకు జరగనున్న ప్రపంచ పర్యాటక ప్రదర్శన
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఉదయం లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, పర్యాటకులను ఆకర్షించడం, పర్యాటక రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి జూపల్లి ఇంగ్లాండ్ పర్యటన కొనసాగనుంది. పర్యటనలో భాగంగా లండన్ లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో మంత్రి జూపల్లి పాల్గొంటారు. అద్భుతమైన ప్రదేశాలు, చరిత్ర, వారసత్వ సంపదను ప్రపంచ దేశాల పర్యాటకులకు తెలిసే విధంగా ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో తెలంగాణ పర్యాటక శాఖ స్టాల్ ను ఏర్పాటు చేయనుంది. ఆయా దేశాల పర్యాటక శాఖ మంత్రులు, విదేశీ ప్రతినిధులు, గ్లోబల్ టూరిజం బోర్డులు, హోటళ్ల యజమానులు, ప్రయాణ, ఆతిధ్య రంగ నిపుణలతో మంత్రి జూపల్లి భేటీ కానున్నారు. రాష్ట్రంలో పర్యాటక, ఆతిధ్య రంగంలోపెట్టుబడుల అనుకూలతల గురించి చర్చించనున్నారు.
……………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
