ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 8 నుంచి పాదయాత్ర చేయనున్నారు. మూసీ (Musi)పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలకు పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి వివరిస్తానని గతంలో తెలిపారు. ఈమేరకు తన పాదయాత్రకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 8 తన పుట్టినరోజు(Birthday)న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి(Yadadri Laxmi narasaimha Swamy)ని దర్శించుకుని, పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ వెంట పాదయాత్ర కొనసాగిస్తారు. పాదయాత్రలో మూసీ పరివాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను కలిసి, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ విప్ బీర్ల (Government Vip Beerla Ilayya)ఐలయ్య హెలిప్యాడ్, ఆలయ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
