ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన కుటుంబ సర్వేను తీరును గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందని సీఎం పేర్కొన్నారు. 2025లో చేపట్టే దేశవ్యాప్త జనగణలో కుటుంబ సర్వేను పరిగణలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్‌ను సీఎం కోరారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
