* ఏఐ న్యాయవాధి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: ఢిల్లీలో నేషనల్ జుడిషియల్ మ్యూజియాన్ని గురువారం ప్రారంభించగా..చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు చెందిన న్యాయవాధికి ఓ ప్రశ్న వేశారు. భారత్లో మరణశిక్ష రాజ్యాంబద్దమేనా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ఆర్టిఫిషియల్ లాయర్ మాట్లాడుతూ.. అవును, మరణశిక్ష భారత్లో రాజ్యాంగబద్దమే అని పేర్కొన్నారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే ఆ శిక్షను ఖరారు చేస్తారని, చాలా హేయమైన నేరాలకు సుప్రీంకోర్టు ఆ శిక్ష వేస్తుందన్నారు. సోమవారం నుంచి కొత్త సీజేగా బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
……………………………….