ఆకేరున్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఏపీలో గుంటూరు-కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. వైసీపీ కూడా ఎన్నికలకు సన్నద్ధం అవుతుంది. కాగా, రెండు జిల్లాల్లో ఎన్నికలను బైకాట్ చేస్తున్నట్లు వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్నినాని ప్రకటించాడు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేదని, తమ నేతలను, కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్న పరిస్థితుల్లో బైకాట్ నిర్ణయం తీసుకున్నామని పేర్నినాని గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో వెల్లడిరచారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
