* తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు..
* రేవంత్ పై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Brs President Ktr) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా విమర్శల వర్షం కురిపించారు. మూసీ పునరుజ్జీవ పాదయాత్ర నేపథ్యంలో కేసీఆర్(Kcr) పై చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. తెలంగాణ(Telangana) ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారని, ఆ పేరును ఎవరూ చెరిపివేయలేరని గుర్తుపెట్టుకో.. మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. “నువ్వు చెప్పులు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చి తిరుగుతున్నప్పుడే.. ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే.. ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వాప్నించాడు. పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడు.
తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకుంటే.. ఆయన రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు ‘డబ్బుల బ్యాగులు’ పట్టుకున్నప్పుడు.. సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టాడు. నీలాంటి జోకర్ ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు. గుర్తు పెట్టుకో మిస్టర్ ‘చీప్’ మినిస్టర్ రేవంత్(Revanth)” అని కేటీఆర్ పేర్కొన్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
