* నా జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు..
* నా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి..
* మీ జిల్లాను అభివృద్ధి చేసుకున్నా.. మేం ఏడవలేదు..
* ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది.. సహకరించండి..
* త్వరలో మక్తల్ – నారాయణపేట ప్రాజెక్టు ప్రారంభిస్తాం
* మహబూబ్నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి
* కురుమూర్తి స్వామిని దర్శించుకున్న సీఎం, మంత్రులు
ఆకేరు న్యూస్, మహబూబ్నగర్ : పాలమూరుకు నిధుల వరద పారిస్తానని, తన జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే చరిత్ర క్షమించదని సీఎం రేవంత్ రెడ్డి(CM REVANTHREDDY) అన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి(KURUMURTHY SWAMY) క్షేత్రాన్ని మంత్రులు కోమటిరెడ్డి వెంటకరెడ్డి(KOMATI REDDY VENKATAREDDY), దామోదర రాజనర్సింహ(DAMODARA RAJANARSIMHA)తో కలిసి సీఎం సందర్శించారు. స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఎక్కడు ఉన్నా జిల్లా అభివృద్ధి కోసమే ఆలోచిస్తున్నానని, నిరంతరం పర్యటించలేకపోయినా సచివాలయంలో ఉండి తగిన ఆదేశాలు జారీ చేస్తున్నానని వివరించారు. తన జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండని ప్రతిపక్షాలకు హితవు పలికారు.
కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు
అభివృద్ధిని చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని, ఎవరైనా జిల్లా ప్రాజెక్టులను అడ్డుకోవాలని చూస్తే పాలమూరు యువత ఊరుకోరని తెలిపారు. త్వరలో మక్తల్ – నారాయణపేట ప్రాజెక్టు(MAKTHA – NARAYANA PETA PROJECT) ప్రారంభిస్తామని చెప్పారు. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇవ్వడంతోనే మీరు రెండు సార్లు తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారని మరిపోకండని, మీ జిల్లాను అభివృద్ధి చేసుకున్నా తాము ఏడవ లేదని అన్నారు. ఇప్పుడు మా జిల్లా అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందని, రాజకీయ కక్షతో అడ్డుకోవద్దని కోరారు. కేసీఆర్(KCR) పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తి కాలేదన్నారు. మహబూబ్నగర్ జిల్లాకు కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు.
బీటీ రోడ్లు లేవనే మాట వినదలుచుకోలేదు..
బీటీ రోడ్లు లేవనే మాటను తాను వినదలుచుకోలేదని రేవంత్ వెల్లడించారు. మారుమూల గ్రామాలకు, లంబాడీ తండాలకు కూడా బీటీ రోడ్లు (BT ROADS)వేసే బాధ్యత మీ బిడ్డగా తాను తీసుకుంటా అన్నారు. వాటికి అంచనాలు వేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇన్ చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక సమావేశం నిర్వహించి రోడ్ల నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలివ్వాలని తెలిపారు.
……………………………………………..