* వరంగల్ కేఎంసీ హాస్పిటల్లో ఘటన
ఆకేరు న్యూస్, వరంగల్ : నీటి కొరతతో వరంగల్ కేఎంసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్( KMC Super Specialty Hospital)లో డయాలసిస్ సేవలు నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని నిలోఫర్(Nilofer) ఆస్పత్రిలో నీటి కొరతతో రెండు రోజుల క్రితం ఆపరేషన్లు నిలిచిపోయాయి. విషయం తెలిసిన అధికారులు వెనువెంటనే చర్యలు చేపట్టి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ ఘటన మరువక ముందే ఈరోజు వరంగల్(Warangal) ఆస్పత్రిలో అదే పరిస్థితి తలెత్తింది. అక్కడ కూడా నీటి కొరతతో వైద్య సేవలకు ఆటంకం కలిగింది. డయాలసిస్ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
