* యువతే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో
* ఆసక్తికర హామీలు
ఆకేరు న్యూస్ డెస్క్ : మహారాష్ట్ర(MAHARASTRA)లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ(BJP) మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సంకల్ప్ పత్ర’ పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఆదివారం విడుదల చేశారు. కాంగ్రెస్ కులగణన అంటుంటే, బీజేపీ నైపుణ్య గణన పేరుతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. యువతకు 25 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల డిమాండ్, సరఫరాను అంచనా వేయడానికి సమగ్ర నైపుణ్య గణన వంటి అంశాలను మేనిఫెస్టో(MENIFESTO)లో పొందుపరిచింది. ప్రస్తుతం 11 లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూరుస్తున్న ‘లఖపతి దీదీ’ (LAKHPATHI DEEDHI)పథకాన్ని 50 లక్షల మంది మహిళలకు విస్తరిస్తామని హామీనిచ్చింది. రైతులు ఎరువులపై చెల్లించిన జీఎస్టీ (GST) ని తిరిగి చెల్లించి, వారి ఆర్థిక భారాన్ని తగ్గించడం, పారిశ్రామిక అభివృద్ధిని పెంచేందుకు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, వృద్ధులకు అందించే నెలవారీ పెన్షన్ను రూ.1,500 నుంచి రూ.2,100కు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణపై దృష్టి వంటి అంశాలను మేనిఫెస్టోలో పేర్కొంది.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
