
* ఆర్టీసీ బస్సులో అంధ బాలుడు పాటపాడిన వీడియో విస్తృతంగా వైరల్
* టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టిని ఆకర్షించిన పాట
* అంధ యువకుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ కీరవాణిని రిక్వెస్ట్ చేసిన సజ్జనార్
ఆకేరున్యూస్ డెస్క్: ఆర్టీసీ బస్సులో వైకల్యం (అంధ బాలుడు)తో ఉన్న యువకుడు సీటులో కూర్చొని పాట పాడిన వీడియో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈవీడియో టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టిని ఆకర్షించింది. అంతే ఆ యువకుడిలోని టాలెంట్‌ను మెచ్చుకుంటూ అతనికి ఓ బ్రహ్మాండమైన వేదిక కల్పించాలని కోరుతూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణిని రిక్వెస్ట్ చేశారు. యువకుడు బస్సులో పాడిన వీడియోను సోషల్ మీడియా వేదికలో కీరవాణికి షేర్ చేసి ఈ అంధ యువకుడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటూ కామెంట్ పెట్టారు.
……………………………….