* బొంతపల్లిలో తల్లీ, కొడుకును హత్య చేసిన దుండగుడు
ఆకేరున్యూస్, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ దుండగుడు తల్లీ, కొడుకును నడిరోడ్డుపై దారుణంగా హతమార్చాడు. ఈ విషాదకర సంఘటన సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన నాగరాజు (30) తన రెండేండ్ల కొడుకు మృతికి సరోజాదేవి (50)అనిల్ (30) అనే తల్లీ, కొడుకులు కారణమనే అనుమానంతో వారిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో వారు పనిమీద వెళ్తుండగా.. గురువారం నడిరోడ్డుపై కత్తితో పొడిచి ఇద్దరిని హతమార్చాడు. మృతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
