* శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహాలు చోరీ…
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : దేవాలయంలోని పంచలోహ విగ్రహాలను దొంగిలించిన ఘటన కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు శ్రీ రాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ వారి పంచలోహ విగ్రహాలను దొంగిలించారు. దొంగిలించిన విగ్రహాల విలువ సుమారు 40000 రూపాయలు ఉంటుందని తెలిపారు. శనిగరం గ్రామానికి చెందిన భీమిలి మోహన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
