* ఖమ్మం మెడికల్ కాలేజీలో కలకలం
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. మెడికల్ విద్యార్థికి గుండు కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం మెడికల్ కాలేజీ(Khamam Medical College) లో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఈ నెల 12వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ములుగు(Mulugu) జిల్లాకు చెందిన విద్యార్థి ఖమ్మం మెడికల్ కాలేజీలో ఫస్టియర్ద చదువుతున్నాడు. కాలేజీ హాస్టల్లోనే ఉంటున్నాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ (Chanis Hair Cutting)చేయించుకుని వచ్చాడు. సెకండియర్ విద్యార్థులు అది చూసి బాగోలేదని చెప్పడంతో.. మళ్లీ వెళ్లి డిఫరెంట్ స్టైల్లో కటింగ్ చేయించుకున్నాడు.
ఆ విద్యార్థి హాస్టల్‌కు వచ్చేసరికి యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్.. బాధితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దగ్గరలోని సెలూన్ కు తీసుకెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు. దీనిపై బాధితుడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ నెల 13న ప్రిన్సిపల్ రాజేశ్వరరావుకు ఫిర్యాదుచేశారు. విద్యార్థి ఫిర్యాదుపై స్పందించిన ప్రిన్సిపల్ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్‌ను విధుల్లో నుంచి తప్పించారు. ఈ ఉదంతంపై ప్రత్యేక కమిటీని నియమించి రహస్యంగా విచారణ చేయిస్తున్నారు. తాజాగా ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రిన్సిపల్ స్పందించారు. నలుగురు సభ్యులతో కమిటీ(Comittee) వేసిన మాట వాస్తవమేనని.. నివేదికను తొందరలోనే డీఎంఈకి పంపిస్తామని తెలిపారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
