కాంగ్రెస్ నేతలు
* రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యం
ఆకేరు న్యూస్, ములుగు: రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాలు, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనల మేరకు తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించనున్న ‘చలో ఢిల్లీ – తెలంగాణ గళం, బలం’ కార్యక్రమానికి గురువారం బయలుదేరారు.
ఈ సందర్భంగా ముందుగా మేడారంలోని సమ్మక్క–సారలమ్మ వనదేవతల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు
అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాలను వివరిస్తూ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా ఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, ఓటు హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే చర్యలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ గళాన్ని, బలాన్ని చాటాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.
పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అరెం లచ్చు పటేల్, సహకార సంఘం మాజీ చైర్మన్ పులి సంపత్ గౌడ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు యాషాడపు మల్లయ్య, జిల్లా నాయకుడు తాండాల శ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోడి సతీష్ కుమార్, మాజీ సర్పంచ్ బెజ్జూరి శ్రీనివాస్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు భూషబోయిన రవికుమార్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మర్రి నరేష్, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు గొంది సరిత, సింగిల్ విండో డైరెక్టర్ ఆకుల సమ్మయ్య గౌడ్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంట సాయి రెడ్డి, మండల నాయకులు రాపోలు సంజీవ రెడ్డి, కోట సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

