ఎర్రబెల్లి దయాకర్‌రావు
* ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటరు నమోదును వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ డివిజన్ కేంద్రంలోని కేఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన గురువారం స్టేషన్ ఘన్పూర్, జఫర్‌గఢ్ మండలాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి నాగుర్ల వెంకన్న, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులు ఆన్లైన్ ద్వారా ఓటర్లుగా నమోదు చేసుకునేలా నాయకులు, కార్యకర్తలు చొరవ తీసుకోవాలని అన్నారు. పట్టభద్రులను ఫోన్ ద్వారా సంప్రదించడంతోపాటు నేరుగా కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీకి అనుకూలంగా ఉండే ప్రతి ఓటు కీలకమని, ఒక్క ఓటును కూడా నిర్లక్ష్యం చేయకుండా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని కోరారు.
భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచేలా అందరూ ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గణేష్, కౌన్సిలర్లు మధు, రాజేశ్వర్, అనిల్, రాజేష్, రమ్య, నాయకులు సింగపురం జగన్, ఆకుల కుమార్, పార్సి రంగారావు, పావని తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

