ఆకేరున్యూస్ డెస్క్: జార్ఖండ్లో బుధవారం రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతుండగా.. ఆ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభించకముందే.. మావోయిస్టులు చెలరేగి పోయారు. ఒకేసారి అయిదు ట్రక్కులకు నిప్పు పెట్టారు. లతేహర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెరాంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లాత్ అటవీ ప్రాంతంలో రాత్రి 1.30 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. లతేహర్లో బొగ్గు ప్రాజెక్టు వద్ద రవాణా కోసం వాహనాలకు నిప్పు పెట్టారు. బొగ్గును ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రక్కులకు నిషేధిత జార్ఖండ్ ప్రస్తుత కమిటీ నిప్పు పెట్టినట్లు సమాచారం.. ఘటన పట్ల విచారణకు ఆదేశించారు. వాహనాలను దగ్దం చేసిన కేసులో తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ కుమార్ గౌరవ్ తెలిపారు. సంఘటనా స్థలం వద్ద కరపత్రాలను వదలి వెళ్లారు. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు సాగాలంటే తమతో చర్చలు జరపాలని ఆ కరపత్రంలో మావోయిస్టులు పేర్కొన్నట్లు ఎస్పీ తెలిపారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
