* పదేళ్లుగా ఎంపిగా అవినాశ్ చేసిందేమిటి
* సోషల్ విూడియా సైకోల భరతం పట్టాల్సిందే
* పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్
ఆకేరున్యూస్, కడప: కడప స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపనలకే పరిమితమైందని, పదేళ్లు స్థానిక ఎంపీగా ఉన్న అవినాష్‌రెడ్డి కడప స్టీల్‌ప్లాంట్ కోసం ఏం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ( SHARMILA ) ప్రశ్నించారు. బుధవారం కడపలో నిర్వహించిన విూడియా సమావేశంలో షర్మిల మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి నాయకులను ఎన్నుకునే ముందు ఆలోచించుకోవాలన్నారు. గత ఐదేళ్లలో స్టీల్ ప్లాంట్ కోసం జగన్ చేసిందేవిూ లేదన్నారు. పేద ప్రజల కోసం, కడప ప్రాంత అభివఅద్ధి కోసం వైఎస్సార్ (YSR) చిత్తశుద్ధితో దీన్ని తీసుకొచ్చారని అన్నారు.
10 వేల ఎకరాల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడితో 20 మిలియన్ల టన్నుల సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలన్నది ఆయన ఆశయమని, దీని ద్వారా 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశముందన్నారు. కడప ప్రాంత అభివఅద్ధికి స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఉద్యమబాట పడుతుందని, అవసరమైతే నిరవధిక నిరాహార దీక్షకూ సిద్ధం అని షర్మిల అన్నారు. అలాగే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారిని కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. తనతో పాటు వైఎస్ విజయమ్మ, సునీతపై పోస్టులు పెట్టించింది వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి అని పోలీసులు నిర్ధరణకు వచ్చారని.. అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
